హజ్ కోటా పెంపు: మార్చ్ 30 డెడ్‌లైన్
- March 08, 2017
ఖతార్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే యాత్రీకుల సంఖ్య ఈ ఏడాది బాగా పెరగవచ్చునని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మక్కాలోని గ్రాండ్ మాస్క్ వద్ద విస్తరణ కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి యేడాదీ 20 శాతానికి పైగా హజ్ కోటాని పెంచడం జరుగుతోంది. ఈ ఏడాది కూడా ఆ స్థాయిలోనే పెంపుదల ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. తొలి వారంలో 10,800 మంది హజ్ కోటా కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చ్ 30తో అప్లికేషన్లకు డెడ్‌లైన్ ముగుస్తుంది. ఏప్రిల్ మధ్యలో అప్లికేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఎంపికైనవారికి ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేస్తారు. అప్లికెంట్స్ నుంచి పూర్తి సమాచారాన్ని అందుకోవడం ద్వారా వారికి హజ్ యాత్రలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తెలుసుకునేందుకు వీలవుతుందని అధికారులు అంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా బాగా పనిచేస్తోందని వారు అంటున్నారు. అరబిక్ మరియు ఇంగ్లీషు భాషల్లో మినిస్ట్రీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ల కోసం అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







