5మంది ఉగ్రవాదులను.. ఉరి తీసిన పాకిస్తాన్
- March 08, 2017
కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ బుధవారం ఉరి తీసింది. ఓ కారాగారంలో మరణ శిక్షను అమలు చేసినట్లు పాక్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐదుగురు తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులుగా తెలిపాయి. పాక్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన వీరిని రెండు నెలల కిందట మూతపడిన ఆర్మీ కోర్టు దోషులుగా ఖరారు చేసి మరణశిక్ష విధించింది.
2014లో పాక్‌కు చెందిన తాలిబాన్ ఉగ్రవాదులు ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి చిన్నారులతో పాటు 150 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో ప్రత్యేక ఆర్మీ కోర్టులను ఏర్పాటు చేసిన పాక్ ప్రభుత్వం రెండేళ్ళ కాలంలో 400 మందికిపైగా ఉగ్రవాదులకు మరణ శిక్షలు విధించి అమలు చేసింది.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







