హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- June 23, 2026
దక్షిణ బ్రెజిల్‌లో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. శాంటా కాటరినా ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఉత్సాహంగా హాట్ ఎయిర్ బెలూన్ ఎెక్కిన పర్యాటకుల ప్రయాణం ఊహించని రీతిలో ప్రాణాంతకంగా మారింది. మొత్తం 21 మంది పర్యాటకులతో గాల్లోకి ఎగిరిన కాసేపటికే, బెలూన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బెలూన్ అంతటా వ్యాపించడంతో గాల్లోనే భారీ ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రతకు భయపడి కొందరు పర్యాటకులు గాల్లో నుండి కిందకు దూకేయగా, మరికొందరు బెలూన్ బాస్కెట్‌లోనే చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు. ఈ హృదయవిదారక దుర్ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు: భద్రతా లోపాలపై స్థానిక ప్రభుత్వం విచారణ
పర్యాటక రంగానికి ఎంతో పేరుగాంచిన శాంటా కాటరినాలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రకృతి దృశ్యాలను వీక్షించాలనే ఆనందం కాస్తా, గాల్లోనే ప్రాణాలు కలిసిపోయేలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బ్రెజిల్ అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. బెలూన్ గ్యాస్ సిలిండర్ లీకేజీ లేదా సాంకేతిక లోపం వల్లనే మంటలు అంటుకున్నాయా అనే కోణంలో స్థానిక ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. పర్యాటక సంస్థల భద్రతా ప్రమాణాలపై సర్కార్ నిఘా పెంచింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







