వేల సంఖ్యలో సరిహద్దులు దాటిన అఫ్ఘనిస్థాన్ మరియు పాకిస్తాన్ దేశస్తులు
- March 09, 2017
దాదాపుగా 51వేలమంది అఫ్ఘనిస్థాన్ దేశస్తులు, 2,700మంది పాకిస్థానీయులు తమ సరిహద్దులు దాటారు. గత నెల రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అఫ్ఘన్‌తో సరిహద్దును మూసివేసిన పాక్ రెండు రోజులపాటు తిరిగి తెరిచింది. దీంతో ఆ రెండు దేశాల్లో ఆగిపోయిన వారంతా తమ మాతృదేశానికి తరలి వెళ్లారు. ఇప్పటి వరకు పైన పేర్కొన్న సంఖ్యలో సరిహద్దు దాటారని పాక్ అధికారులు తెలిపారు.
అఫ్ఘనిస్థాన్ వెళ్లడానికి పాక్‌కు బాలోచిస్థాన్‌లోని తోర్కాం, చమన్ ప్రాంతాల వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతమే అతి పెద్దది.. కీలకమైనది. ఈ ప్రాంతంలో గత నెల మిలటరీ దాడి జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సరిహద్దును మూసివేశారు.
చివరకు రాజకీయ చర్చలు జరిగి వేగంగా ఇరు దేశాల వారిని మార్పిడి చేసుకునే ఒప్పందం చేసుకొని, ఇమ్మిగ్రేషన్ చట్టాలను పరిశీలించి తాజాగా సరిహద్దును తెరిచారు. ఇప్పటివరకు మొత్తం 55 వేలమంది పరస్పరం తమ ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం