కువైట్‌లో 36 కిలోమీటర్ల భారీ వంతెన

- March 09, 2017 , by Maagulf
కువైట్‌లో 36 కిలోమీటర్ల భారీ వంతెన

పశ్చిమ ఆసియా దేశమైన కువైట్‌ భారీ వంతెన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఉత్తరాన మారుమూల ప్రాంతమైన సుబియాని అభివృద్ధి చేస్తూ సిల్క్‌సిటీ ఏర్పాటు లక్ష్యంగా 36 కి.మీ. మేర ఈ వంతెనను నిర్మిస్తున్నది. కువైట్‌ ప్రభుత్వం ఈ భారీ బ్రిడ్జి నిర్మాణానికి 3 బిలియన్‌ డాలర్లు ( రూ.20,017 కోట్లు ) ఖర్చు చేస్తున్నది. గల్ఫ్‌ప్రాంతానికి మధ్య ఆసియా, యూరోప్‌తో అనుసంధానించే పురాతన సిల్క్‌ రోడ్‌కు నూతన శక్తిని ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణం ఇప్పటికే దాదాపు మూడు వంతులు పూర్తయింది. దీని నిర్మాణం పూర్తయినట్టయితే కువైట్‌ నగరం నుంచి సుబియా ప్రాంతాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.ప్రస్తుతం సుబియాని చేరుకునేందుకు 90 నిమిషాల సమయం పడుతున్నది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com