బుధవారం నుండి రొయ్యల వేటపై 6 నెలల పాటు నిషేధం

- March 11, 2017 , by Maagulf
బుధవారం నుండి రొయ్యల వేటపై  6 నెలల పాటు నిషేధం

కింగ్డమ్ లో సముద్ర వనరులను రక్షించే ప్రయత్నంలో భాగంగా రొయ్యలపై వార్షిక నిషేధం  బుధవారం నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ప్రతిపాదన సంఖ్య 27  2017 ప్రకారం సముద్ర ప్రాణులు మరియు తాజా రొయ్యలు అమ్మకంను బుధవారం నుండి సెప్టెంబర్ 15 వరకు నిషేధించినట్లు వర్క్స్, పురపాలక వ్యవహారాల అర్బన్ ప్లానింగ్ మంత్రి ఇస్సామ్ ఖలాఫ్ ప్రకటించారు.ఈ మేరకు  గురువారం అధికార గెజిట్లో ప్రచురించబడింది. దీని ప్రకారం స్థానిక మార్కెట్లలో యధాతధంగా సముద్ర జీవులు ,తాజా చిన్నరొయ్యలను విక్రయించరాదు.అంతే కాక సముద్రంలో జలచరాలను రొయ్యలను  పట్టుకోవడంలో ఉపయోగించే వలలు, మర పడవలు తదితర పరికరాలు మరియు ఉపకరణాలను  ఆరు నెలల పాటు నిషేధం విధించారు. ఆ సమయంలో ఎవరైనా సముద్రంలో వేటాడం చట్టవిరుద్ధ చర్యగా మార్చి 7 వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనబడిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిబంధనలను  ఉల్లంఘించినవారిపై బహెరిన్ చట్ట ప్రకారం విధించబడే చర్యలకు వారే బాధ్యులని హెచ్చరించారు. ప్రతి ఏటా సముద్ర వనరులను రక్షించడానికి మరియు జీవుల పునరుత్పత్తి ప్రక్రియను  అనుమతించేందుకు నాలుగు నుంచి ఆరు నెలల కాలానికి రొయ్యలను వేటాడటం నిషేధం అని తెలిపారు. ఈ తరహా నిర్ణయాలు కువైట్ ప్రాంతములోని ఇతర దేశాల్లోనూ అమలు జరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com