ఎక్స్‌ప్లోర్ యూఏఈ - అల్టిమేట్ ఆఫ్ రోడ్ ఫన్ డ్రైవ్
- March 11, 2017
అరేబియన్ ఆటోమొబైల్ కంపెనీ - ఫ్లాగ్ షిప్ ఆటోమోటివ్ డివిజన్, ఎవి రోస్తమాని గ్రూప్ మరియు ఎగ్జిక్యూటివ్ డీలర్ నిస్సాన్ - దుబాయ్, షార్జా, నార్తరన్ ఎమిరేట్స్ తొమ్మిదవ ఎడిషన్ ఎక్స్‌ప్లోర్ యూఏఈని ఇనాక్ గ్రూప్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మార్చ్ 17న ఈ ఆఫ్ రోడ్ ఫన్ డ్రైవ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేవారికి హిల్టన్ అల్ హమ్రా బీచ్ అండ్ గోల్ఫ్ రిసార్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. డిజర్ట్‌లో లంచ్ కూడా ఏర్పాటు చేస్తుండడం గమనించదగ్గది. అత్యున్నత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసి, ఆఫ్ రోడ్ డ్రైవ్‌ని ఔత్సాహికుల కోసం అందజేస్తున్నారు నిర్వాహకులు. ఈవెంట్ అంతా డ్రైవింగ్ ఎక్స్‌పర్ట్స్ వాహనాలు నడిపేవారికి సహాయకులుగా వ్యవహరిస్తారు. ఆటోప్రో సంస్థ మెకానిక్ టీమ్స్‌ని ఏర్పాటు చేస్తోంది. ఎమిరేట్స్ ఇస్లామిక్ ప్లాటినమ్, ఆటో ప్రో, మాప్‌ఫైర్ గోల్డ్ స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు. 9వ ఎడిషన్ ఎక్స్‌ప్లోర్ యూఏఈ అత్యద్భుతంగా జరుగుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







