బస్సు దగ్ధం: భవనం పాక్షిక ధ్వంసం

- March 11, 2017 , by Maagulf
బస్సు దగ్ధం: భవనం పాక్షిక ధ్వంసం

నార్తరన్‌ గవర్నరేట్‌ పరిధిలోని సౌత్‌ వెస్టర్న్‌ పార్ట్స్‌ ప్రాంతంలో ఓ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఓ భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. హమాద్‌ టౌన్‌ దగ్గర్లో దార్‌ కులైబ్‌ విలేజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఈ ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. సివిల్‌ డిఫెన్స్‌ వర్గాలు సమాచారం అందగానే, అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఓ భవనంతోపాటు, ఓ షాప్‌ కూడా ఈ ఘటనలో కాలిపోయాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com