బంపర్ కాంబినేషన్ తో వస్తున్న రాంచరణ్
- March 11, 2017
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు బడా హీరోలతో కలిసి ఒక సినిమాలో నటించబోతున్నాడన్నది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ న్యూస్. తమిళ స్టార్ హీరోలు విక్రమ్, విజయ్ లతో కలిసి చరణ్ నటిస్తాడట. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్ట్ ను స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్ట్ చేయడమేకాదు, ప్రొడ్యూ్సర్ కూడా ఆయనేని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్న చరణ్ తర్వాత చేసే ప్రాజెక్ట్ ఇదేనంటున్నారు.
చరణ్ సహా తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, ఇళయదళపతి విజయ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతుందని న్యూస్. మణిరత్నం హోమ్ బ్యానర్ మద్రాస్ టాకీస్ పతాకంపైనే చిత్రాన్ని నిర్మించే ఈ చిత్రం జూన్ 2017 నుంచి సెట్స్‌పైకి వెళుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా చరణ్ కు తమిళఇండస్ట్రీలో మార్కెట్ పెరిగేందుకు దోహదపడుతుందనే చెప్పాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







