గూగుల్ స్ట్రీట్ వ్యూలో '3డీ'లో భారత్ అందాలు
- September 24, 2015
భారతదేశంలోని అన్ని నగరాలు, పర్వతాలు, నదులు, ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలను 3డీలో, 360 డిగ్రీల కోణంలో అత్యంత స్పష్టంగా కళ్లకు కట్టినట్లుగా ఇక ముందు 'గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో వీక్షించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. అందుకు భారత ప్రభుత్వం గూగుల్ కు అనుమతి ఇవ్వడానికి సిద్దం అయ్యిందని మంగళవారం సంబంధిత అధికారులు న్యూఢిల్లీలో చెప్పారు. అయితే రక్షణ రంగ నిర్మాణాలు, అణు కార్యక్రమాల ప్రదేశాలతో పాటు దేశంలోని సున్నితమైన ప్రాంతాలు గూగుల్ లో అందుబాటులోకి రావని అధికారులు అన్నారు. దేశంలోని సుందరమైన ప్రాంతాలు ప్రజలు వీక్షించడానికి వీలుగా ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ గూగుల్ కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, పీఎంఓ శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించారని, గూగుల్ కు లాంఛనంగా త్వరలో సమాచారం అందిచనున్నామని సంబంధింత అధికారులు స్పష్టం చేశారు. గూగుల్ స్ట్రీట్ ప్యూలో 2007 నుంచి అమెరికా, కెనడా, యూరోప్ దేశాల అందమైన ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఉన్నాయి. ఆదేశాలలో వీటిని విసృతంగా వినియోగిస్తున్నారు. భారత్ లో తాజ్ మహల్, ఎర్రకోట, వారణాసి నదీ తీరం, కుతుబ్ మినార్, చార్మినార్, నలంద యూనివర్శిటి, తంజావూరు, మైసూరు ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, జోగ్ ఫాల్స్ తదితర సుందరమైన ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఉన్నాయి. గూగుల్ స్ట్రీట్ ప్యూలో ప్రపంచ వ్యాప్తంగా అందురూ చూడటానికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. భారత పురావస్తు పరిశోధక శాఖ భాగస్వామ్యంతో గూగుల్ తన 'స్ట్రీట్ వ్యూ'లో భారత అందాలు పోందుపరచనుంది. గూగుల్ మ్యాప్ లో నీలిరంగు రేఖల ద్వార వీటిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







