మరగదనాణయంకు యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్‌బోర్డు
- March 12, 2017
మరగదనాణయం చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ సర్టిఫికెట్ అందించింది.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన చిత్రం మరగదనాణయం.ఆనందరాజ్, మునీష్‌కాంత్, కాళీవెంకట్, అరుణ్ రాజ కామరాజ్, డేనీ, కోటాశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైమ్‌గోపి ము ఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్‌కే.శరవణ్ దర్శకత్వంలో యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై డిల్లీబాబు నిర్మిస్తున్నారు.యాక్షన్, ఎండ్వెచర్, వినోదం కలగలిపిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర వర్గాలు వెల్లడించారు.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మరగదనాణయం చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు.
చిత్రాలకు యూ సర్టిఫికెట్ రావడమే గగనంగా మారిన తరుణంలో తమ చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత ఢిల్లీబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.మంచి కథా చిత్రాలను నిర్మాంచాలన్న ఒక ఆశయంతో ఈ రంగంలోకి వచ్చామని, మరగద నాణయం ఆ స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను పొందుతోంది.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుందన్నది గమనార్హం.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







