మలయాళ సినీ డైరెక్టర్ చేతన్ కన్నుమూత!
- March 13, 2017
అనారోగ్యంతో బాధపడుతున్న మలయాళ సినీ డైరెక్టర్ దిఫన్ చేతన్ (47) ఈ రోజు తుది శ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేటు హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న చేతన్ కన్నుమూశారు. ఆయన స్వస్థలం తిరువనంతపురంలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, చేతన్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. నటుడు పృథ్వీరాజ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా విచారం వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు మంచి చిత్రాల్లో తనకు నటించే అవకాశం లభించిందన్నారు.
ఇదిలా ఉండగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన దిఫన్ చేతన్, 2003లో ‘లీడర్ కింగ్ మేకర్’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారారు. దాదాపు 7 చిత్రాలను ఆయన డైరెక్ట్ చేశారు. 2009 లో నటుడు పృథ్వీరాజ్ తో ‘పుతియా ముఖం’, 2012లో ‘హీరో’, ‘సిమ్’, 2014లో ‘డాల్ఫిన్ బార్’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. దిఫన్ చేతన్ తెరకెక్కిస్తున్న ‘సత్య’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







