మంచు వర్షాలు కారణంగా అమెరికాలో ఎమెర్జెన్సీ
- March 14, 2017
అమెరికాలో ఎమెర్జెన్సీ విధించారు. అయితే ఇది భద్రతాపరమైన ఎమెర్జెన్సీ కాదు.. మంచు వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాహనాలు రోడ్లపైకి వచ్చేందుకు వీల్లేక పోవడంతో పలు ప్రాంతాల్లో ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం నుంచి స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఫిలడెల్ఫియాలో సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు చెప్పారు.
విస్కన్సిన్ రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీని విధించారు. ఇందులో భాగంగా మిల్వౌకీ కౌంటీ, కెనోషా, వౌవాటోసా, సెయింట్ ఫ్రాన్సిస్, వెస్ట్ అల్లీస్, జెర్మన్‌టౌన్, ప్లీజంట్ ప్రైరీ, సౌక్విల్లీ, న్యూబర్గ్ వంటి విస్కన్సిన్ రాష్ట్ర ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు.
న్యూజెర్సీలోనూ ఎమర్జెన్సీ విధించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ క్రిస్ క్రిష్టీ తెలిపారు. ఈ నగరాల్లో ప్రజలెవరూ ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







