అమెరికాకు ఉత్తర కొరియా వార్నింగ్
- March 14, 2017
తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా అమెరికా భారీ మూల్యం చెల్లంచుకోక తప్పదని ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. జాలి, దయ.. ఇలాంటివేమీ ఉండవని, వాయు, జల, భూ మార్గాల ద్వారా దాడికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
మరో మాటలో చెప్పాలంటే.. అగ్రరాజ్యమా.. తొక్కా.. మా జోలికొస్తే తోలు తీస్తామంటూ అమెరికాను హెచ్చరించింది ఉత్తర కొరియా. ఈ మేరకు ఆ దేశ అధికార న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొంది.
దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న విన్యాసాల్లో భాగంగా నేవీ సూపర్ క్యారియర్ 'కార్ల్ విన్సన్'ను అమెరికా మోహరిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ విధంగా స్పందించింది. అమెరికా ఈ చర్య వెనుక తమ దేశంపై దాడి చేయాలన్న కుట్ర దాగి ఉందని ఉత్తర కొరియా మండిపడింది.
మార్చి 11న కూడా శత్రువుల యుద్ధవిమానాలు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని, తమ దేశ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం కోసమే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కేసీఎన్ఏ ఆరోపించింది.
ఇప్పటికే దక్షిణ కొరియాలో యాంటీ మిస్సైల్ సిస్టమ్ 'థాడ్'ను మోహరించడంపై చైనా తన వ్యతిరేకతను వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు ఉత్తర కొరియా కూడా ఘాటుగా వార్నింగ్ ఇవ్వడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







