ఎమిర్, ఎమిర్ తండ్రి ఈద్ ప్రార్థనలు
- September 25, 2015
ఎమిర్‌షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, మరియు ఆయన తండ్రి ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గురువారం ఉదయం అల్ వజ్బా వద్ద ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. డిప్యూటీ ఎమిర్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ థని, షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ థని మరియు షేక్ మహ్మద్ బిన్ ఖలీఫా అల్ థని మరికొందరు షేక్‌లు, మంత్రులు, రాయబారులు, పెద్ద సంఖ్యలో పౌరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల్ని నడిపించిన డాక్టర్ థకీల్ సేయర్ అల్ షమ్మరి, అసాంఘీక శక్తుల్ని తరిమికొట్టి, ఇస్లాం దేశాల మధ్య ఐక్యతను పెంపొందించాలనీ, ఇస్లాం ధర్మాన్ని ప్రతి ముస్లిం పాటించాలనీ, ప్రార్థనా మందిరాల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలనీ పిలుపునిచ్చారు. అల్ అథా సందర్భంగా ఎమిర్, ఈద్ అల్ అధా ప్రార్థనలు విజయవంతంగా జరిగాయనీ, ఈ ప్రార్ధనల్ని సజావుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







