హజ్ తొక్కిసలాట: యాత్రీకులకు యూఏఈ భరోసా
- September 25, 2015
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ అధికారిక హజ్ మిషన్ ప్రతినిథులతో టెలిఫోన్‌లో సంభాషించారు. హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి ఆరా తీసిన షేక్ మహ్మద్, యూఏఈ యాత్రీకులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ ఛైర్మన్, యూఏఈ హజ్ మిషన్ అధికారి డాక్టర్ మొహమ్మద్ మతార్ అల్ కాబి మాట్లాడుతూ, షేక్ మహ్మద్ హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కలత చెందారనీ, యూఏఈ యాత్రీకుల భద్రతపై ఆయన ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారనీ, యూఏఈ యాత్రీకుల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన కూడా చేశారనీ, మృతుల అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారనీ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించమని షేక్ మహ్మద్ చెప్పారన్నారు కాబీ. తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చాలా దూరంగానే యూఏఈ యాత్రీకులు చాలావరకు ఉన్నారనీ, వారికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం వార్షిక హజ్ యాత్ర సందర్భంగా మీనాలో జరిగిన తొక్కిసలాటలో 717 మంది మృత్యువాత పడిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







