శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల్ఫ్ అమరులకు నివాళి

- March 15, 2017 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల్ఫ్ అమరులకు నివాళి

నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన పొలాస సంతోష్ కుమార్ మూడు నెలల క్రితం సౌదీలో చనిపోయారు. అతని మృతదేహం కలిగిన శవపేటిక ఈ రోజు (15.03.2017) హైదరాబాద్ విమానాశ్రయం కు చేరుకున్నది. శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

గల్ఫ్ లో మరణించిన వందలాది మంది ప్రవాసీల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించాము.

ఫోటో: (ఎడమ నుండి కుడికి): చెలిమెల సంతోష్, నందిపేట (సౌదీ రిటర్నీ); గన్ను ధర్మరాజు రెడ్డి, హస్నాబాద్, జగిత్యాల; కడార్ల రంజిత్ కుమార్, జగిత్యాల; డిపి రెడ్డి, టి-జెఎసి, హైదరాబాద్; మంద భీంరెడ్డి, మైగ్రంట్స్ రైట్స్ కౌన్సిల్, హైదరాబాద్; ధనుంజయ్, నందిపేట (ముంబై).

--యం.భీంరెడ్డి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com