ఓ శుభవార్త సామ్సంగ్ ఎస్8 కొందామనుకుంటున్నవారికి
- March 16, 2017
ఎన్నో ప్రత్యేకతలతో రాబోతున్న సామ్సంగ్ గెలాక్సీ ఎస్8 మొదటి నుంచీ వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ర్యామ్ మొదలుకుని డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా వంటి ఎన్నో స్పెసిఫికేషన్లపై చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారమూ విడుదల చేయని సంస్థ తొలిసారి ఎస్8పై ఓ శుభవార్త తెలిపింది. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్7తో భంగపడ్డ సంస్థ ఎస్8 విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగా తీసుకురాబోతుంది. వినూత్నంగా ఉండేలా ఇన్ఫినిటీ డిస్ప్లేతో రాబోతున్నట్లు తెలుస్తోంది. 18:9 రేషియోతో ఫుల్ విజన్ డిస్ప్లే కొత్త అనుభూతిని మిగులుస్తుంది. మొబైల్‌ని ఐమూలగా చూసినా స్పష్టంగా కనిపించడమే దీని ప్రత్యేకత.
ర్యామ్ 6జీబీ, అంతర్గత మెమరీ 128 జీబీ ఉండబోతుంది. నూగట్ వర్షన్‌తో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా హెచ్డీ రిజిల్యూషన్తో 6.2 అంగుళాల తాకే తెరతో వస్తుంది. వెనుక కెమెరా 16 మెగా ఫిక్సెల్, బ్యాటరీ 3000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







