ఎన్నో ఏళ్లుగా వెతికితే దొరికింది నా భర్తకు:జయసుధ!
- March 17, 2017
సహజనటిగా తెలుగునాట మన్ననలు అందుకున్న జయసుధ జీవితంలో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త నితిన్ కపూర్ ఇటీవలే మరణించారు. ఈ రోజు (మార్చి 17) జయసుధ పెళ్లి రోజు. 32 ఏళ్ల క్రితం ఇదే రోజున జయసుధ, నితిన్‌కపూర్ ఒకటయ్యారు. ఈ సందర్భంగా తన భర్త గురించి జయసుధ ఫేస్‌బుక్‌లో స్పందించింది. 'నా భర్త నితిన్ కపూర్ ఇప్పుడు దేవతలతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయన వెతికిన శాంతి ఇప్పుడు ఆయనకు దొరికింది. డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైన మెడికల్ కండిషన్. నా జీవితంలోని ఈ చీకటి కోణాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు నా ధన్యవాదాలు. ఇప్పుడు నా కుటుంబ స్వేచ్ఛకే నా మొదటి ప్రాధాన్యం. 32 ఏళ్ల కిత్రం ఇదే రోజు మా ఇద్దరం ఒకటయ్యాం.
ఆయన సహచర్యంలో గడిపిన మధుర క్షణాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా మమ్మల్ని కాపాడుతూనే ఉంటారని నాకు తెలుసు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. ఈ విషాద సమయంలో నాకు, నా కుటంబానికి మద్దతు ప్రకటించిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు' అని జయసుధ కామెంట్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









