హెచ్ 1 బీ వీసాల ప్రాబ్లం తీరినట్టే
- March 17, 2017
హెచ్ 1 బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం భారత ఐటీ కంపెనీలకు కాస్త ఊరటనిచ్చింది. 2018 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ వర్క్ వీసాలకోసం ఏప్రిల్ 3 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసుల విభాగం ప్రకటించింది. అయితే ఈ అప్లికేషన్లను ఎప్పటివరకు స్వీకరిస్తారో.చివరి తేదీని మాత్రం వెల్లడించలేదు. (2018 ఆర్ధిక సంవత్సరం ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుంది). ఏమైనా ఈ ప్రకటన మన దేశ ఐటీ సంస్థలకు, ప్రొఫెషనల్స్ కు కొంతవరకు రిలీఫ్ నిచ్చేదే !
బహుశా ఈ ఏడాది హెచ్ 1 బీ వీసాల ప్రోగ్రాం లో మార్పు ఉండక పోవచ్చుననడానికి ఇది సూచన అని భావిస్తున్నారు. నిజానికి హెచ్ 1 బీ వీసాల నిబంధనలను కఠినతరం చేయాలని ఇద్దరు సెనేటర్లు సెనెట్ కు సమర్పించిన తమ బిల్లులో కోరిన విషయం గమనార్హం.
హెచ్ 1 బీ వీసా ప్రోగ్రాం వల్ల తమ దేశంలోని కంపెనీలు తాత్కాలికంగా విదేశీ సిబ్బందిని నియమించుకోవడానికి వీలవుతుందని యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసుల అధికారులు పేర్కొంటున్నారు. హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను ఏప్రిల్ 3 నుంచి 6 నెలల పాటు నిలిపివేస్తున్నట్టు ఇటీవల అమెరికా అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







