పిల్లిని కుక్కలతో చంపించిన వ్యక్తికి 3 నెలల పాటు ' జూ ' శుభ్రం చేయాలని తీర్పు

- March 17, 2017 , by Maagulf
పిల్లిని కుక్కలతో చంపించిన వ్యక్తికి  3 నెలల పాటు ' జూ ' శుభ్రం చేయాలని తీర్పు

" పిల్లిని చంపితే ...మహా పాతకమంటారు " మరి కుక్కల చేత చంపిస్తే పెద్దగా శాపం తగలదేమో బహుశా అనుకోని ఉంటాడా సైకో ..అంతటితో ఆగక ఆ భీకరమైన వీడియోని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి...తనంతట తాను  చనిపోయిన పిల్లి ఉసురు తగిలేలా చేసుకొన్నాడు.  దుబాయ్‌లో ఒక వ్యక్తి తాను పెంచుకుంటున్న కోడిని, ఓ పిల్లి  తినేసిందని దాన్ని హతమార్చేడు .కోడిని తిన్న పిల్లిని అతడు ఒక బోనులో బంధించాడు. దాన్ని ఒక ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు. నాలుగు కుక్కలను సైతం అక్కడికి తీసుకువచ్చాడు. ఆ నాలుగు కుక్కలు ఒక్కసారే పిల్లిపై దాడి చేసి చంపి తింటుంటే అక్కడే కూర్చుని తాపీగా వీడియో తీశాడు. అక్కడితో ఊరుకోకుండా ఆ వీడియోను తాను  ఏదో సాహసకార్యం చేసినట్లుగా మాదిరిగా  ఫేస్‌బుక్‌లో,ట్విట్టర్‌లో పలువురికి పోస్టు చేశాడు. అది కాస్త వైరలయ్యింది. దాంతో అందరూ ఈ దారుణ సంఘటనపై విమర్శిస్తూ ఆ వ్యక్తి చేష్టలను ఖండించారు. ఈ విషయం చివరకు  దుబాయ్ ప్రధాని రషీద్ అల్ ముక్తమ్ దృష్టికి వెళ్లింది. దీనితో ఆయన ఆగ్రహించి తక్షణమే ఆ సైకోని  అరెస్ట్ చేయమని పోలీసుశాఖను ఆదేశించాడు. అలాగే ఆ భయానక వీడియోని ఎందరికో షేర్ చేసిన  గల్ఫ్ పౌరునికి  మరియు ఇద్దరు ఆసియా దేశస్థులు అత్యుత్సాహంతో విస్తృతంగా సామాజిక మీడియాలో ఆ వీడియోని షేర్ చేసినందుకు వారూ ఖైదు చెయ్యబడ్డారు. జంతువులపై  క్రూరత్వంని నిరోధించడానికి ఇటీవల అమలులోకి తెచ్చిన చట్టం ప్రకారం  జైలులో ఒక సంవత్సరం లేదా 200,000 దిర్హాములు ( 54,500 డాలర్లు ) జరిమానా విధించనున్నారు. అలాగే అతడు మూడు నెలలపాటు రోజుకి నాలుగు గంటలచొప్పున దుబాయ్ జూ మొత్తం శుభ్రం చేయాలని శిక్షని  విధించాడు. మూగ జీవులను హింసించడం నేరామని అది ఇస్లాం ధర్మాలను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com