ఇబ్రాలో ఇండియన్‌ స్కూల్‌ కొత్త బిల్డింగ్‌ నిర్మాణం కోసం బోర్డ్‌ ఒప్పందం

- March 17, 2017 , by Maagulf
ఇబ్రాలో ఇండియన్‌ స్కూల్‌ కొత్త బిల్డింగ్‌ నిర్మాణం కోసం బోర్డ్‌ ఒప్పందం

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (బిఓడి), సైఫ్‌ బిన్‌ హషిల్‌ అల్‌ మాస్కెరీతో కలిసి ఇమ్రాలోని అల్‌ యహ్మాది వద్ద ఇండియన్‌ స్కూల్‌ కొత్త బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అల్‌ మస్కెరీ కార్యాలయంలో మార్చ్‌ 12న ఈ ఒప్పందాల కార్యక్రమం జరిగింది. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ - ఇండియన్‌ స్కూల్స్‌ ఛైర్మన్‌ వి జార్జ్‌, మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, సౌకర్యాలను అందించేందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్‌ స్కూల్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ సిఎం నజీబ్‌, డైరెక్టర్స్‌ ఇన్‌ఛార్జ్‌ బేబీ సామ్‌ సామ్యూల్‌, సికె అంచన్‌, ప్రిన్సిపల్‌ రెగి ఊమ్మెన్‌, అసిస్టెంట్‌ ఎడ్యుకేషన్‌ అడ్వయిజర్‌ అలెక్స్‌ జోసెఫ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతి త్వరలో ఈ భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. 2018లో ఈ భవన నిర్మాణం పూర్తి కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com