15 నెలల తర్వాత వీడిన కేసు మిస్టరీ అమెరికాలో తల్లిని చంపిన తెలుగబ్బాయి
- March 18, 2017
అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసులోని మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది.. ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు. తల్లిని చంపిన ఆ కసాయి కొడుకు.. మృతదేహాన్ని గ్యారేజ్‌లోని కారులో ఉంచి ఏం తెలియనట్టుగా స్కూల్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి.. తన తల్లిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే హత్యా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య గత 2015 డిసెంబరు నెల 17వ తేదీన జరుగగా, ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసులు... చివరకు మృతురాలి కుమారుడే హంతకుడిగా నిర్ధారించారు.
దీంతో ఆమె కొడుకు 17 యేళ్ళ అర్నవ్ ఉప్పలపాటిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. కాగా, హత్యకు గురైన మహిళ పేరు నళిని తెల్లప్రోలు. వీరు కరోలినాలోని రోలాండ్ గ్లెన్ రోడ్డులూ నివశిస్తూ వచ్చారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







