చెల్లాచెదురుగా మృతదేహాలు 13మంది మృతి, ఘోర రోడ్డు ప్రమాదం

- March 18, 2017 , by Maagulf
చెల్లాచెదురుగా మృతదేహాలు 13మంది మృతి, ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. చిత్ర దుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొంది.
ఘటనా స్థలంలోనే 11 మంది కూలీలు మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడివున్నాయి. ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.
వేగంగా వస్తున్న లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను రాంపూర ఆస్పత్రిలో ఉంచినట్లు చెప్పారు. ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com