జయలలిత గురించి అడిగా శోభన్‌బాబు దగ్గరికెళ్లి
- March 18, 2017
'కిటుకులు తెలిసిన చిటపట చినుకులు.. ' అంటూ 'ఘరానా మొగుడు' సినిమాలో కుర్రకారును హీటెక్కించిన వాణీ విశ్వనాథ్ ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతోంది. అప్పట్లో టాలీవుడ్ సీనియర్ హీరోలందరితోనూ ఆడిపాడింది ఈ నాయిక. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో పాటు సోగ్గాడైన శోభన్‌బాబుతో కూడా నటించింది. శోభన్‌బాబుతో తాను ఎలా ఉండేదాన్ననే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ''శోభన్‌బాబుగారు చాలా స్వీట్ హార్ట్. ఆయన దగ్గరికెళ్లి జయలలితగారి గురించి అడిగేదాన్ని. అలా అడగటం తప్పా? రైటా? నాకు తెలిసేది కాదు. కానీ అడిగేదాన్ని. ఆయన నెమ్మదిగా సమాధానం చెప్పేవారు. 'జయలలితగారు చాలా తెలివైనవారు.
చాలాపుస్తకాలు చదువుతారు' అని ఆయనే చెప్పారు.'' అని వాణీ విశ్వనాథ్ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ గురించి చెబుతూ..'' రామారావుగారితో 'సమ్రాట్ అశోక' చేసేటప్పుడు చాలా భయంగా సెట్‌కి వెళ్లా. అంత పెద్ద మనిషి 'మీరు' అని పిలవగానే ఉలిక్కిపడ్డా. ఆయన మర్యాదను చూసి ఆశ్చర్యపోయా.
ఇప్పటికీ నేను చంటిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరినైనా 'మీరు' అనే సంబోధిస్తా. అందుకు కారణం రామారావుగారే. ఆయన దగ్గర ఆ సంస్కారం నేర్చుకున్నా.'' అని వివరించింది.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్‌లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







