బహ్రెయిన్ న్యూ ప్రమోషన్
- September 26, 2015
బహ్రెయిన్లో పరిస్థితులపై మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంతో ప్రపంచానికి బహ్రెయిన్ని కొత్తగా పరిచయం చేయడం, బహ్రెయిన్పై ఉన్న అనుమానాల్ని నివృత్తి కలిగించడం వంటి ఉద్దేశ్యాలతో ఓ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎంఇఎంఆర్ఐ)తో బహ్రెయిన్ ప్రచార కర్తలు ఎంఓయూ చేసుకున్నారు. 'ఇదీ బహ్రెయిన్' పేరుతో బహ్రెయిన్ గొప్పతనాన్ని చాటాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఇఎంఆర్ఐ ఉపాధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్తో బహ్రెయిన్ ఎక్స్పాట్రియేట్స్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ బెట్సీ మాథీసన్ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. 200 మంది సభ్యులు గల ప్రతినిథి బృందం వాషింగ్టన్ మరియు న్యూయార్క్ని మంగళవారం సందర్శించనున్నాయి. అక్కడే ఓ కాన్ఫరెన్స మరియు ఎగ్జిబిషన్ని కూడా నిర్వహిస్తారు. బహ్రెయిన్లో ఏళ్ళ తరబడి ప్రశాంత జీవనం సాగుతుండడం, వివిధ మతాలకు చెందినవారు పరస్పరం గౌరవించుకోవడం వంటి విషయాల్ని ఇక్కడ ప్రమోట్ చేస్తారు. సామాజిక సఖ్యతలో ప్రపంచం చాలా చిన్నదైపోయిందని, అన్ని మతాలూ కలిసి స్వేచ్ఛగా జీవించడం ముఖ్యమని ప్రతినిథులు భావిస్తూ, బహ్రెయిన్ని ప్రమోట్ చేయనున్నారు.
--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







