ఇళయరాజా సాంగ్స్ పాడను ఇక నుంచి ఎక్కడా: ఎస్పీ బాలు
- March 20, 2017
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం "ఎస్పీబీ-50" కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి విధితమే.. ఈ కార్యక్రమంలో భాగంగా బాలసుబ్రమణ్యం అండ్ కో వారు అమెరికాలో ఉన్నారు.. ఈ నేపద్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎస్పీ బాలు కి లీగల్ నోటీసులు పంపించారు.. ఈ విషయంపై బాలసుబ్రమణ్యం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ..."ఇళయరాజా నుంచి లీగల్ నోటీసు అందుకున్న తర్వాత ఆశ్చర్యం వేసింది. నాతోపాటు నా కుమారుడు చరణ్, చిత్రకు కూడా నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులో తన అనుమతి లేకుండా ఇళయరాజా పాటలు పాడకూడదని, అలా చేస్తే కాపీరైటు నిబంధనల ఉల్లంఘన కింద పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుందని ఉంది. నాకు చట్టపరమైన నోటీసులు వచ్చినప్పుడు నేను కూడా చట్టపరంగానే స్పందించాల్సి ఉంటుంది.. కానీ నాకు అటువంటివి ఇష్టం ఉండదు. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. ఇక నుంచి ఇళయరాజా కు అసౌకర్యం కలిగేలా ఆయన పాటల్ని లను పాడబోమని తెలిపారు.. ఈ యాత్ర నిర్వాహకులు, ప్రాయోజకులను ఇబ్బంది పెట్టేలా తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. కాగా ఇదే విషయంపై బాలు మద్దతుగా కొంతమంది.. ఇళయరాజకు మద్దతు గా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.. కాగా బాలసుబ్రమణ్యం, ఇళయరాజాలు కలిసి దాదాపు 40 ఏళ్లనుంచి కొన్ని వేల పాటలకు కలిసి పనిచేశారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







