కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్లు, రజని కి షాక్ ఇచ్చిన అమీర్

- March 20, 2017 , by Maagulf
కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్లు, రజని కి షాక్ ఇచ్చిన అమీర్

సూపర్ స్టార్ రజనికాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమా తెరకెక్కుతుది. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.110 కోట్లకు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించడమే కాదు.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన సంగతి తెలిసిందే.. ఈ రికార్డ్ చాలా కాలం పదిలం అనుకొన్నారు రజని ఫ్యాన్స్.. కానీ ఆ ఆశని బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తుడిచేశాడు. అమీర్ ఖాన్ కొత్త సినిమా థగ్స్ ఆఫ్ ఇందుస్తాన్ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా రూ. 120 కోట్లకు అమ్ముడు పోయి సరికొత్త రికార్డ్ ను సృష్టించాడు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఇంటర్నేషనల్‌గా 86 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ కలిగిన ఇంటర్నెట్ టీవీ నెట్ ఫ్లిక్స్ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను కొనుగోలుచేసిందట. ఫిబ్రవరి లో షూటింగ్ మొదలు పెట్టుకొన్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళి కి రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో అమీర్ ఖాన్ తండ్రిగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు.. ఈ చిత్రం ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ నవల ఆధారంగా తెరకెక్కుతోందని దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com