మొక్కలు పెంచి పరిహారం చేసుకొంటున్న పవన్ ఆ యాడ్ చేసినందుకు

- March 20, 2017 , by Maagulf
మొక్కలు పెంచి పరిహారం చేసుకొంటున్న పవన్ ఆ యాడ్ చేసినందుకు

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కెరీర్ మొదట్లో ఓ కూల్ డ్రింక్ యాడ్ లో చేశాడు.. అనంతరం మళ్ళీ ఏ విధమైన యాడ్స్ లో నటించలేదు.. తనకు ఉన్న స్టార్ డమ్ తో కోట్లు గడించే అవకాశం ఉన్నా పవన్ మాత్రం ఎటువంటి యాడ్స్ ను చేయలేదు... కాగా కెరీర్ మొదట్లో చేసిన పెప్సీ యాడ్ గురించి మాట్లాడుతూ.. తనకు అసలు ఆ యాడ్ చేయడం ఇష్టం లేదు.. మొదట ఆ యాడ్ ను చేయడానికి అంగీకరించినా.. అనంతరం తాను ఆ యాడ్ అంగీకరించి చాలా తప్పు చేసినట్లు పవన్ భావించి అందుకు పరిహారం కూడా చేసుకొన్నా అనే విషయం ఇటీవల బయట పెట్టాడు.. నిజానికి పవన్ కల్యాణ్ ఎటువంటి శీతల పానీయాలు తాగడట.. తాను తాగనిది.. మిగిలిన వారికి ఎందుకు తాగమని చెప్పాలి అని ఆలోచించినా... బలవంతంగా ఆ అగ్రిమెంట్ పూర్తి చేశాడట.. కానీ తాను చేసిన పాపాన్ని కడుక్కోవడానికే... మొక్కలను పెంచడం అలవాటు చేసుకొన్నాడట.. అంతేకాదు.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పవన్ కు కొన్ని కోట్లు ఇస్తామని యాడ్స్ చేయమని ఎందరు అడిగినా మళ్ళీ యాడ్స్ చేయలేదు.. కాగా కోట్లు ఇస్తే చాలు.. ఎటువంటి యాడ్స్ అయినా చేసి.. వివాదాల్లో ఇరుకొనే స్టార్స్ పవన్ ని చూసి ఎంతైనా నేర్చుకోవాల్సింది ఉన్నది.. అని కొంత మంది అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com