ఆంధ్రాబ్యాంకు రిక్రూట్‌మెంట్-2017, సబ్ స్టాఫ్ పోస్టులు

- March 20, 2017 , by Maagulf
ఆంధ్రాబ్యాంకు రిక్రూట్‌మెంట్-2017, సబ్ స్టాఫ్ పోస్టులు

సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకై ఆంధ్రాబ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 31, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు: సబ్ స్టాఫ్
మొత్తం పోస్టులు:27
వయసు పరిమితి: నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అభ్యర్థుల వయసు 18-25సం.లుగా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఏదేని గుర్తింపు కలిగిన బోర్డు నుంచి పదో తరగతి చదివి ఉండాలి. అందులో స్థానిక భాషను చదువుకున్నవారై ఉండాలి. ఇంగ్లీషులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. 
దరఖాస్తు విధానం: నిర్దేశించిన దరఖాస్తులో సరైన వివరాలు నింపి, సంబంధిత డాక్యుమెంట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను జతచేసి ఆంధ్రాబ్యాంకు, హెచ్ఆర్ డిపార్ట్ మెంట్, జోనల్ ఆఫీస్ కు మార్చి 31, 2017లోగా పంపించాలి.
దరఖాస్తుల గడువుకు చివరి తేదీ: 31-03-2017.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com