చిరంజీవి టైటిల్ సమస్య బాలయ్య మూవీ టైటిల్ కు
- March 20, 2017
'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం తరువాత పెరిగిన తన క్రేజ్ ను ఏమాత్రం వృధా పోనివ్వకుండా నందమూరి బాలకృష్ణ తన 101వ చిత్రం మొదలుపెట్టడమే కాకుండా ఆమూవీ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందనున్నఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిఅయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ యూనిట్ త్వరలోనే యూరప్ టూర్ కూడా వెళ్లనుంది అన్నవార్తలు వస్తున్నాయి.
అయితే ఈసినిమాకు సంబంధించి పూరి ఆలోచించిన టైటిల్ కు చిరంజీవి సినిమా సమస్యలు వచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా పూరీ జగన్నాధ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగా సింపుల్ గా ఉంటాయి. కాని ఆ టైటిల్స్ చాలా వెరైటీగా ఉండటంతో జనం మధ్యకు ఈ టైటిల్స్ చాలా సులువుగా చొచ్చుకు పోతాయి.
ఈ నేపధ్యంలో పూరీ జగన్నాథ్ బాలకృష్ణ చిత్రానికి 'టపోరి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్.
ఈ టైటిల్ బాలకృష్ణకు కూడ బాగా నచ్చడంతో ఇదే టైటిల్ ని ఫిక్స్ చేయమని బాలయ్య పూరికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ కు అనుకోకుండా మెగా స్టార్ చిరంజీవి సినిమా సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఈ మూవీ టైటిల్ వినగానే చిరంజీవి సినిమాలోని పాట గుర్తుకు వస్తూ ఉండటం ఒక సమస్యగా మారింది అని తెలుస్తోంది.
చిరంజీవి మెగా స్టార్ గా కొనసాగుతున్న రోజులలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీలో 'టపుటపు టపోరీ' అనే పాట ఉన్న నేపధ్యంలో ఇప్పడు ఈటపోరి మాట వినగానే చిరంజీవి సినిమా గుర్తుకు వస్తుందని బాలకృష్ణ అభిప్రాయ పడుతున్నట్లు టాక్. అప్పట్లో ఈపాట బ్లాక్ బస్టర్ హిట్ కూడ అయిన నేపధ్యంలో ఈ టైటిల్ విషయం ఇప్పడు పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక భారీ కోర్ట్ సీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈకోర్ట్ సీన్ లో బాలకృష్ణ చెప్పే భారీ డైలాగులు చాలా ఉద్వేగ భరితంగా ఉండటమే కాకుండా ఆ డైలాగులు బాలయ్య అభిమానులు కలకాలం గుర్తుంచుకునే విధంగా ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ హిట్ కావడం పూరి కెరియర్ కు ఎంతో అవసరం అయిన నేపధ్యంలో పూరి ఈ సినిమా విజయానికి తన సర్వశక్తులు ఒడ్డి కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..
తాజా వార్తలు
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!







