ఖుష్బూ కాలుకి గాయం

- September 26, 2015 , by Maagulf
ఖుష్బూ కాలుకి గాయం

తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో బబ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చకొని అప్పటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ ఖుష్బు.. ప్రస్తుతం ఈమె రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కలియుగ పాండవులు, కెప్టెన్ నాగార్జున, చిన్నోడు పెద్దోడు, శాంతి క్రాంతి.. ఇలా పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. క్యారెక్టర్ నటిగా చేయడం మొదలుపెట్టాక డా. మోహన్ బాబు సరసన 'యమదొంగ' చిత్రంలో నటించింది. అలాగే, చిరంజీవికి అక్కగా 'స్టాలిన్' చిత్రంలో నటించింది. ఒకవైపు టీవీ షోస్, అడపా దడపా సినిమాలు, తన భర్త దర్శకత్వంలో నిర్మించే చిత్రాల పర్యవేక్షణ, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలతో ఖుష్బూ బిజీ బిజీగా ఉంటోంది. ఇన్నాళ్లూ బిజీ బిజీగా ఉరుకులు పరుగులు తీస్తున్న ఖుష్బూ వేగం ఆగింది. మళ్లీ వేగం పుంజుకోవడానికి కొన్నాళ్లు పడుతుంది. ఖుష్బూ మోకాలికి దెబ్బ తగిలింది. అది చిన్నదే అయినా తగిలిన చోటే నాలుగైదు సార్లు తగలడంతో నడవడం ఇబ్బంది అయ్యిందట. ఈ సారి గాయం కాస్త ఇబ్బంది పెట్టినా అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి వచ్చేసింది. కానీ, మోకాలు కదలకూడదట. ఒక పరికరంలాంటిది ఫిక్స్ చేశారట. అది తీసేవరకూ ఖుష్బూ కదలకూడదు. '"ఏమీ భయపడాల్సిన అవసరంలేదు. చిన్నదే... త్వరగా కోలుకుంటా'' అని ఖష్బూ పేర్కొంది. 

     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com