సౌదీ అరేబియాలో బంధీలైన 29 మందిని విడపించమంటూ సుష్మాకు కేటీఆర్ లేఖ
- March 21, 2017
సౌదీ అరేబియాలోని అల్హసాలో ఉన్ అల్ హజారీ ఓవర్సీస్ కంపెనీలో పని చేస్తున్ 29 మంది తెలంగాణ రాష్ట్ర వాసులను ఆ కంపెనీ గత 12 రోజులుగా నిర్భంధించిందని పురపాలక, ఐటీ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కె. తారకరామారావు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకువెళ్ళారు. వీరందరిని విడిపించి వారి వారి స్వస్థలాలకు తిరిగి తీసుకు వచ్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవానలి కేటీఆర్ కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు. సౌదీ కంపెనీలో పని చేస్తున్న వీరంతా తమ స్వగ్రామాలకు వెళ్ళిపోతామని వేడుకున్నా వినకుండా వారిని కంపెనీ యాజమాన్యం ఒక గదిలో బంధించి ఉంచిదని తెలిపారు. భోజనం,నీరు,మందులు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా 12 రోజులుగా చిత్ర హింసలు పెడుతున్నారని తెలిపారు. సౌదీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన బోరగళ్ళ శేఖర్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని తమకు తెలియజేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







