ఈ స్థాయి లేదు మణిరత్నం గారిని కలవక పోతే : రెహ్మాన్
- March 21, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ మొదట కోటి వంటి సంగీత దర్శకుల వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా చేసిన సంగతి విధితమే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన "రోజా" సినిమాతో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.. రోజా రిలీజైన అన్నీ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్ లో రెహ్మాన్ సంగీతం కూడా భాగం పంచుకొన్నది. ఒక్క సినిమాతోనే యావత్ సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకొన్న రెహ్మాన్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకొన్నాడు.. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన కాట్రువెలియిడై కు సంగీతం అందించాడు.. సోమవారం ఉదయం చెన్నయ్ రాయపేటలోని సత్యం సినిమాస్ థియేటర్లో జరిగిన ఆడియో వేడుకలో పాల్గొన్న రెహ్మాన్ మాట్లాడుతూ.. నేను దర్శకుడు మణిరత్నం గారిని కలిసి ఉండక పోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాను.. అని పేర్కొన్నాడు.. ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతలు అందుకొంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం మణిరత్నం గారు అని తనకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన ఆయనపై అభిమానాన్ని చాటుకొన్నాడు.. రెహ్మాన్.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







