769 కి చేరిన హజ్ తొక్కిసలాట మృతుల సంఖ్యా
- September 26, 2015
హజ్ యాత్ర సందర్భంగా గురువారం మినాలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో మృతిచెందిన భారతీయుల సంఖ్య శనివారానికి 22కి చేరింది. దీంతో ఈ సంఘటనలో మొత్తం మృతుల సంఖ్య 769కి చేరుకుంది. మృతిచెందిన భారతీయులను గుర్తించడానికి సౌదీలోని భారత ఎంబసీ అక్కడి అధికారులతో కలసి పనిచేస్తున్నట్టు భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 18 మంది మృతుల్లో 11 మంది గుజరాత్‌కు చెందినవారేనని చెప్పారు. తొక్కిసలాటలో మొత్తం 13 మంది భారతీయులకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా హజ్‌యాత్రకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాలని సౌదీ రాజు అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించాలనీ ఆదేశించారు. యాత్రికులు అక్కడ ఉన్న అధికారుల సూచనలు పాటించకుండా ముందుకు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగి ఉండవచ్చని సౌదీ ఆరోగ్య మంత్రి ఫలీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







