1000కి పైగా డైమాండ్స్ లభ్యం షూ సోల్‌లో

- March 23, 2017 , by Maagulf
1000కి పైగా డైమాండ్స్ లభ్యం షూ సోల్‌లో

చైనాలో ఓ వ్యక్తి ఏకంగా 1000కి పైగా వజ్రాలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. బూట్లలో ఉండే షూ సోల్ లో  వజ్రాలు పెట్టుకుని షెంజెన్‌ నగరం నుంచి హాంగ్‌కాంగ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా లోహు పోర్ట్‌లో కస్టమ్స్‌ ఆఫీసర్స్ పట్టుకున్నారు. ఆ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో డౌట్ వచ్చిన అధికారులు అతడిని అదుపులో తీసుకుని సెర్చ్ చేశారు. దీంతో బూట్లలో వజ్రాలు కనిపించాయి. అతడి వద్ద 212.9 క్యారెట్ల వజ్రాలు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం లోహు పోర్టులోనే ఓ వ్యక్తి ఆహారం ప్యాకెట్‌ నుంచి 1554 వజ్రాలు గుర్తించామని, అవి 164 క్యారెట్లు ఉన్నాయని వెల్లడించారు ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు మరింత సమాచారం కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com