ఐపీఎల్-10 సీజన్ విక్రయానికి హైదరాబాద్ ఐపీఎల్ టిక్కెట్లు
- March 24, 2017
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ముంబయి, బెంగళూరు తదితర జట్లు సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనూ అభిమానుల కోసం టిక్కెట్ల పంపిణీ మొదలు పెట్టేశారు. స్టేడియంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభ వేడుకలకు సంబంధించిన టిక్కెట్లను మాత్రం ఇప్పటి వరకూ ఏ జట్టు అందుబాటులోకి తీసుకురాలేదు. హైదరాబాద్‌లో జరిగే 7 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం మార్చి 25 నుంచి సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఉప్పల్ మైదానంలో జరగనున్నాయి. తర్వాతి రోజు ఉప్పల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







