స్కూల్ లోనే ఆద్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసిన పవన్ రేణు లు
- March 24, 2017
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేణు దేశాయ్ లు కొంత కాలం సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకొన్నారు.. ఈ దంపతుల సంతానం అకిరానందన్, ఆద్య లు.. కాగా పవన్ రేణు దంపతులు విడాకులు తీసుకొన్న నేపద్యంలో రేణు అకీరా, ఆద్యాలతో పాటు పుణె లో నివాసం ఉంటుంది.. కాగా పవన్ కళ్యాణ్ తండ్రిగా పిల్లాల విషయం లో ఎప్పుడు బాధ్యతగా ఉంటాడు అని రేణు దేశాయ్ పలు మార్లు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది.. కాగా ఆద్య 2010 మార్చి 23 న జన్మించినది.. ఈ నేపద్యంలో గురువారం (మార్చి 23) న పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్య పుట్టిన రోజు వేడుకలను రేణు దేశాయ్ తో కలిపి ఆద్య స్కూల్ లో సెలబ్రేట్ చేశాడు... అక్కడ ఆద్య రేణు లతో పాటు పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నాడు.. తండ్రిగా తన పిల్లల విషయంలో బాధ్యతను పవన్ నిర్వహించడం లో ఎప్పుడు నిర్లక్షంగా ఉండడు అని రేణు చెప్పిన మాటలు పవన్ ఈ వేడుకల ఫోటోలను చూసిన వారికి అర్ధం అవుతుంది.. ఆద్య తన తండ్రి మీద ఒక చేతిని.. ఒక చేతిని తల్లి మీద వేసి తనకు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చూపిస్తున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా పవన్ కల్యాన్ తాజా సినిమా కాటమరాయుడు సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొన్నది.. గత కొన్ని నెలలుగా పవన్ ఇటు రాజకీయంగా.. అటు సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు.. నిన్న కూతురు పుట్టిన రోజు వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యినట్లున్నాడు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







