'కాటమరాయుడు' : రివ్యూ
- March 24, 2017
రివ్యూ : కాటమరాయుడు
నటీనటులు : పవన్ కళ్యాణ్, శృతీహాసన్
సంగీతం : అనూప్ రూబెన్స్
దర్శకత్వం: డాలీ (కిషోర్ పార్థసారధి)
నిర్మాత: శరత్ మరార్
రిలీజ్ డేట్ : 24 మార్చి, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే.. పండగొచినట్టే. ఈసారి మాత్రం పండగ పూట పవన్ సినిమా వచ్చేసింది. ఉగాది కానుకగా పవన్ 'కాటమరాయుడు' నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ్ స్టార్ అజిత్ సూపర్ హిట్ చిత్రం 'వీరమ్'కి రిమేక్ ఇది. డాలీ దర్శకుడు. పవన్ సరసన శృతిహాసన్ జతకట్టింది. పవన్ తమ్ముళ్లుగా అజయ్, కమల్ కామరాజు, శివ బాలాజీ, కృష్ణ చైతన్యలు నటించారు.
కాటమరాయుడు టీజర్ కోటికిపైగా
వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది. దీంతో.. రిలీజ్ కి ముందే 'కాటమరాయుడు'ని బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు.
గత యేడాది వచ్చిన 'సర్థార్ - గబ్బర్ సింగ్' లాస్ లెక్కని సరిచేసేందుకు 'కాటమరాయుడు'ని మొదలెట్టాడు పవన్. అందుకు తగ్గట్టుగానే కాటమరాయుడు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. దాదాపు రూ.120కోట్లకిపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. అది కూడా పవన్ రెమ్యూనరేషన్ మినహాయిస్తే. తెలుగు రాష్ట్రాల్లో 1700 థియేటర్స్ కాటమరాయుడు రిలీజ్ అయ్యింది. బెనిఫిట్ షోస్స్ లో పవన్ అభిమానులు సందడి మాములుగా లేదు. మరీ.. కాటమరాయుడు టాక్ ఎంటీ.. ? హిట్టా.. ఫట్టా.. బ్లాక్ బస్టర్ హిట్టా.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
కాటమరాయుడు (పవన్ కళ్యాణ్)ది.. రాయలసీమలోని తాళ్లపాక గ్రామం. ఊరికి పెద్దగా. పేదోళ్ల పాలిట దేవుడిగా రాయుడి కొలుస్తుంటారు గ్రామస్తులు.
కాటమరాయుడుకి తమ్ముళ్లు శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు అంటే ప్రాణం. పెళ్లి చేసుకొంటే విడిపోతామనే భయంతో.. అసలు పెళ్లి కాదు కదా ఆడపిల్లల వంకే చూడడు. పెళ్లీడు వచ్చి దాటిపోతున్నా.. పెళ్లి మాటెత్తడు. మరోవైపు తమ్ముళ్లు ప్రేమ వ్యవహారాలు మొదలెట్టేస్తారు.
తమ ప్రేమ కోసం తమ్ముళ్లు అన్న(కాటమరాయుడు)ను లింగబాబు (ఆలీ) సాయంతో ప్రేమ ముగ్గులోకి దింపుతారు. ఊరికి కొత్తగా వచ్చిన క్లాసికల్ డ్యాన్సర్ అవంతి (శృతీహాసన్)ని కాటమరాయుడు ప్రేమించే విధంగా స్కెచ్ వేసి సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఏమైంది.. ? ఇంతకీ శృతిహాసన్ ఎవరు ? ఆమె బ్యాక్ గౌండ్ ఏంటీ.. ?? కథలో తరుణ్ అరోరా ఎవరు ??? చివరి అవంతిని కాటమరాయుడు పెళ్లాడాడా ???? అనేది మిగితా కథ.
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని దర్శకుడు డాలీ నిలబెట్టుకొన్నాడు. అభిమానులు పవన్ ని ఎలా చూడాలని ఆశపడుతారో.. ? అచ్చం అలాగే చూపించాడు. దర్శకుడు వీరమ్ కథని దాదాపు ఫాలో అయిపోయాడు. అయితే, పవన్‌కల్యాణ్ పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. పవన్ ఇండ్రక్షన్ సీన్, పవన్ - శృతిహాసన్ ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా మలిచాడు.
కాటమరాయుడు ఎలా కనిపించాడంటే.. ?
పవన్ హుశారుగా కనిపించాడు. గత చిత్రాల కన్నాఎక్కువ రొమాంటిక్‌గా కనిపిస్తాడు. పవన్ నుంచి ఆశించే వినోదం ప్రతి సన్నివేశంలో కనబడింది. అన్నదమ్ముల మధ్య బలమైన భావోద్వేగ సన్నివేశాలు. పవన్ - శృతిల రొమాన్స్ సీన్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకొన్నాయి. మొత్తంగా పవన్ వన్ మేన్ షో చేశాడు.
శృతి సూపర్భ్ :
పవన్ - శృతిహాసన్ ల మధ్య కెమిస్ట్రీ సూఫర్భ్ గా ఉంది. అవంతిక పాత్రలో శృతి చక్కగా కనిపించింది. శ్రుతిహాసన్ అందంగా కనిపించింది. రెండు పాటల్లో గ్లామర్ షో చేసింది. పవన్ - శృతిహాసన్ లది హిట్ పెయిర్ అని మరోసారి రుజువు చేసింది కాటమరాయుడు.
పవన్ తమ్ముళ్లు :
కాటమరాయుడులో పవన్ తమ్ముళ్లుగా అజయ్, కమల్ కామరాజు, కృష్ణ చైతన్య, శివబాలజీలు కనిపించారు. వీరద్దరు వారి వారి పరిది మేరకు నటించారు. అన్నని తమ్ముళ్లు లవ్ లోకి దించేందుకు చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. అలీ పాత్ర అందర్ని ఆకట్టుకుంటుంది. ఇక, మిగిలిన నటీనటులు వారి వారి పరిధి మేరకు నటించారు. విలన్ గా తరుణ్ అరోరా సూట్ కాలేదు.
సాంకేతికంగా :
కాటమరాయుడు పాటలు బాగున్నాయి. తెరపై చూడ్డానికి ఇంకా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అనూప్ రూబెన్స్ మాయ చేశాడు. ఆర్ ఆర్ ఆదిరిపోయింది. రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాల్లో కొత్త మ్యాజిక్ థీమ్‌తో మెప్పించాడు. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్‌గా ఉంది. రామ్, లక్ష్మణ్ ఫైట్స్ లో కొత్తధనం చూపారు. ఎడిటింగ్ ఓకే. పవన్ సినిమా ఎప్పుడూ రిచ్ గా ఉంటుంది. కాటమరాయుడు ఆ రేంజ్ లోనే ఉన్నాడు.
బాటమ్ లైన్ : 'కాటమరాయుడు'.. పవన్ ఫ్యాన్స్ కాలరెగిరేసే సినిమా !
ఈ సినిమా కి మాగల్ఫ్ వారి రేటింగ్ : 3.75/5
తాజా వార్తలు
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!









