సెమీ ఫైనల్‌కి చేరిన ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌

- March 25, 2017 , by Maagulf
సెమీ ఫైనల్‌కి చేరిన ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌

ఇండియన్‌ స్కూల్‌, సెమీ ఫైనల్‌ లైనప్‌ని పూర్తి చేసింది. ఇంటర్మీడియట్‌ బాయ్స్‌ స్టేజ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ - ఫోర్త్‌ మినీ ఒలింపిక్స్‌లో ఇండియన్‌ స్కూల్‌ జట్టు ఈ ఘనత సాధించింది. మూడు టీమ్‌లు, ఐదు పాయింట్లతో మూడు గ్రూపుల్లో నిలవగా, బెస్ట్‌ రన్నర్స్‌ టీమ్‌, రౌండ్‌ రాబిన్‌ మ్యాచెస్‌ ద్వారా ఎంపిక చేయబడింది. ఇండియన్‌ స్కూల్‌, ఐబిఎన్‌ అల్‌ హైతామ్‌ ఇస్లామిక్‌ స్కూల్‌పై విక్టరీ సాధించింది. ఆ తర్వాత సెమీ ఫైనల్స్‌ కోసం నిర్వాహకులు డ్రా నిర్వహించారు. ఆదివారం సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌ జరగనుంది. ఎ గ్రూప్‌ విన్నర్స్‌ బి గ్రూప్‌ విన్నర్స్‌తో తలపడ్తారు. సి గ్రూప్‌ విన్నర్స్‌ డి గ్రూప్‌ విన్నర్స్‌తో పోటీ పడతారు. ఈ మ్యాచ్‌లో విజేతలు ఫైనల్‌లో తలపడ్తారు. బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు అలాగే మినీ వాలీబాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటివి ఈ వారంలో ఇప్పటికే పూర్తి చేసేశారు. ఆక్వాథ్లాన్‌, స్విమ్మింగ్‌, జియు, జిట్సు, మాకీ, అథ్లెటిక్‌, కార్టింగ్‌ రానున్న వారంలో జరిగే పోటీలు. ముగింపు పోటీలు మార్చ్‌ 29న జరుగుతుంది. మార్చ్‌ 30న పోటీలు ముగుస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com