పాస్‌పోర్ట్‌పై తప్పుడు వివరాల నమోదు

- March 25, 2017 , by Maagulf
పాస్‌పోర్ట్‌పై తప్పుడు వివరాల నమోదు

ఇద్దరు భారతీయులు తమ పాస్‌పోర్టులపై తప్పుడు వివరాలు నమోదు కావడం పట్ల ఆందోళన చెందారు. జితిన్‌ కుమార్‌, సుమిత్‌ ఆ ఇద్దరు వ్యక్తులు. కుమార్‌ పాస్‌పోర్ట్‌పై ఇంకో భారత జాతీయుడి వివరాలు స్టాంప్‌ అయ్యాయి. సుమంత్‌ పాస్‌పోర్ట్‌పై కుమార్‌ డిటెయిల్స్‌ కనిపించాయి. ఈ ఇద్దరూ ఐవిఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌కి తమ పాస్‌పోర్ట్స్‌ని సబ్‌మిట్‌ చేశారు. సుమిత్‌, తన పాస్‌పోర్ట్‌ని వెంటనే చెక్‌ చేసుకుని పొరపాట్లను గుర్తించాడు. అత్యవసరంగా తాను యూరోప్‌కి వెళ్ళాల్సి వచ్చిందనీ ఈలోగా తప్పుడు వివరాలతో ఆందోళన చెందాననీ అయితే అదృష్టవశాత్తూ పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోడానికి అవకాశం దొరికిందని కుమార్‌ పేర్కొన్నారు. అయితే ఐవిఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ సంస్థ, తప్పిదం తమ వల్ల జరగలేదనీ, అది ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ చేసిన పొరపాటు అని వివరించింది. కుమార్‌, సుమిత్‌ కేవలం రెండ్రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com