వైద్య పరీక్షలకు స్నేహితుడిని పంపిన వ్యాపారిపై విచారణ
- March 25, 2017
దుబాయ్ : ' స్నేహబంధం..ఎంత మధురమూ అది కరిగిపోదు ..చెరిగిపోదు ' . అనుకొంటూ...అక్రమాలకూ ఆ బంధాన్ని వినియోగిస్తే జైలులో జంటగా కూర్చోవాలి.. ఆరోగ్య పరీక్షలో నెగ్గని ఓ వర్తకుడిని కాపాడేందుకు మరియు ఒక అధికారిక పత్రంని ఫోర్జరీ చేసేందుకు సంహరించిన అభియోగంపై ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హెపటైటిస్ బి జబ్బు ఉన్న కారణంగా వైద్య ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యేందుకు తన స్నేహితుడు ఒక నైజీరియా సేల్స్ మాన్ ని అభ్యర్ధించి తనకు బదులుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరాడు.. స్నేహమో ...మొహమాటమో.. ఒప్పుకొన్న ఆ వ్యక్తి ప్రక్రియ పూర్తిచేయడమే కాక ఆ వ్యక్తిని కాపాడేందుకు ఒక అధికారిక పత్రం ఫోర్జరీ లో సహకరించిన నేరంలో అదుపులోనికి తీసుకోబడ్డాడు. 36 ఏళ్ల వ్యక్తి వీసా పొందే పద్ధతిలో భాగంగా అవసరమైన పరీక్షలు నెగ్గేందుకు , అల్ ముహాసన , అల్ క్కుసైస్ ఫిట్నెస్ సెంటర్ ను సందర్శించడం జరిగింది...ఫోటోలో ఉన్న విధంగా కాక , శరీరాకృతి వేరేవిధంగా ఉండటంతో ఫిట్నెస్ సెంటర్ లో పరీక్షలు జరిపినవారికి అనుమానం రావడంతో పోలీసులకు ఆ సమాచారం అందించడంతో ఆ అమాయక స్నేహితుడిని గత ఏడాది నవంబర్ 21 వ తేదీన 2016 న అరెస్టు చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రస్తుతం విచారణలు జరుపుతుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







