31 లోగా ఆస్తులు వెల్లడించకపోతే కఠిన చర్యలు

- March 25, 2017 , by Maagulf
31 లోగా ఆస్తులు వెల్లడించకపోతే కఠిన చర్యలు

నల్లకుబేరులు స్వచ్ఛందంగా తమ ఆస్తులు వెల్లడించాలని, లేకపోతే చింతించక తప్పదని ఐటీ శాఖ హెచ్చరించింది.  పీఎంజీకేవై పథకం కింద ఆస్తులు వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐటీ శాఖ హామీ ఇచ్చింది. ఆదాయాన్ని వెల్లడించని డిఫాల్టర్ల పేర్లను ఈడీ,సీబీఐ వంటి జాతీయ సంస్థలకు తెలియజేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.  డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల చట్టం కూడా ప్రయోగిస్తామని ఆయన చెప్పారు.  ఆదాయాన్ని వెల్లడించకుండా ఆధారాలు లేని డబ్బుతో దొరికిపోయిన వారికి 83.25 శాతం పన్ను విధిస్తామని, అధికారులు తనిఖీలు చేసి ఆధారాలు లేని ఆదాయాన్ని కనుగొంటే 107.25 శాతం పన్నుతో పాటు జరిమానా విధిస్తామని తెలిపారు.  అధికారుల తనిఖీలలో కూడా ఆదాయాన్ని బహిర్గతం చేనివారికి జరిమానాతోపాటు 137.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు.  ఒకవేళ ఉల్లంఘనలపై బినామీ చట్టాన్ని ప్రయోగిస్తే వారికి ఏడేండ్ల కఠిన కారాగారశిక్షతో పాటు ఐటీ చట్టం కింద ఆరోపణలు మోపే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com