చిల్లర కోసం పర్స్ కొట్టేసిన నిర్మాత చిల్లర కల్యాణ్ కొడుకు
- March 25, 2017
మనిషికి విలువ గౌరవం ఇప్పుడు ఐతే ఆస్తులను, డబ్బును బట్టి ఇస్తున్నారు కానీ.. వెనుకటి రోజుల్లో వారి కుటుంబం లోని సభ్యులు ప్రవర్తన, నడవడికను బట్టి ఇచ్చేవారు.. కాగా కొంత మంది కోట్లలో ధనం సంపాదించినా.. వారికి ఉన్న చిల్లర బుద్దులు మాత్రం పోవు... తాజాగా ప్రముఖ నిర్మాత చిల్లర కల్యాణ్ కుమారుడు ఇదే విధంగా ప్రవర్తించాడు.. చిల్లర కల్యాణ్ అంటే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. పవన్ కల్యాణ్ పిలిచి మరీ టికెట్ ఇచ్చినా జనసేన తరపున పోటీ చెయ్యను అని వ్యాఖ్యానిస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచే వివాదాస్పద నిర్మాత చిల్లర కల్యాణ్ తనయుడు చిల్లరగా ఓ దొంగ తనం చేసి అడ్డంగా బుక్ అయ్యాడు.. వివరాల్లోకి వెళ్తే...
బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్.12 లో ఎమ్మెల్యే కాలనీకి చెందిన ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి గురువారం తన కుమారుడితో కలిసి ఫిలిం నగర్ కల్చరల్ సెంటరు వచ్చి అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో స్నానం చేసేందుకు తన పర్స్ తో పాటు దుస్తులను కూడా అక్కడే పెట్టాడు.. స్నానం చేసి స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటకు వచ్చి చూసే సరికి పర్స్ మిస్సయ్యింది... కాగా పర్స్ మిస్ గంటలోనే అతని డెబిట్, క్రెడిట్ కార్డుల మనీ వేరే ఖాతాలోకి ట్రాన్సఫర్ అయ్యాయి.. ఈ విషయం మెసేజ్ ఎలర్ట్స్ ద్వారా తెలిసింది. దీంతో షాక్ తిన్న ఆ వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. వెంటనే పోలీసులు స్పందించి ఆ కార్డుల్లోని మనీ ఎవరికి ఖాతాల్లోకి ట్రాన్సఫర్ అయ్యాయో విచారించగా.. యాక్సిస్ బ్యాంక్ కార్డు నుంచి రూ. 1.82 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి రూ. 27600 మొత్తం చిల్లర వరుణ్ కుమార్ ఖాతాలోకి జమ అయినట్లు తేలింది. అంతేకాదు.. స్విమ్మింగ్ ఫూల్ దగ్గర ఉన్న సీసీ కెమేరాల్లోనూ పర్సును కొట్టేసింది వరుణ్ కుమారే అని గుర్తించారు. దీంతో చిల్లర వరుణ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







