ఉగాది కి ప్రారంభం కానున్న రామ్ కొత్త చిత్రం
- March 25, 2017
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. గతేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్‌పై విడుదలైన నేను శైలజ ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌ను సరికొత్తగా ప్రెజంట్ చేసిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రంలో సరికొత్త లుక్, బాడీలాంగ్వేజ్‌తో చూపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 29న లాంచనంగా ప్రారంభం కానుంది. నేను శైలజ చిత్రాన్ని అద్భుతమైన మ్యూజిక్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తుండగా సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ ఎ.ఎస్.ప్రకాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుందని నిర్మాతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







