రామ్ గోపాల్ వర్మ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్
- March 26, 2017
'కాటమరాయుడు' విడుదలైనరోజు నుండి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్స్ యుద్ధం కొనసాగుస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా వర్మ పవన్ పై మరోక షాకింగ్ ట్విట్ పెట్టాడు.
30 కోట్లుపెట్టి సినిమా తీసి 100 కోట్లకి అమ్ముకొని 70 కోట్లు జేబులో వేసుకుని కూతురు బర్థ్ డే కోసం వెళ్ళిపోవటం అంటే రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేల్ వాయించినట్లుగా ఉందని కామెంట్స్ చేస్తూ వర్మ పెట్టిన షాకింగ్ ట్విట్ పై బండ్ల గణేష్ చాల ఘాటుగా స్పందించాడు. వర్మ తన కామెంట్స్ ను అదేవిధంగా తన భాషను కంట్రోల్ లో పెట్టుకోవడం చాలమంచిది అంటూ ఘాటైన చురకలు అంటించాడు బండ్ల గణేష్.
అంతేకాదు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక ఎక్స్ పెయిర్ అయిపోయిన ట్యాబ్ లేట్ లాంటి వాడని అంటూ పవన్ కాలి చెప్పులకు కూడ వర్మ సరిపోడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఇలాంటి కామెంట్స్ కు విమర్శలకు ఏమాత్రం పట్టించుకొని వర్మ బండ్ల గణేష్ కామెంట్స్ కు మరింత అసహనానికి లోనై పవన్ ను అతడి సినిమాలను మరింత టార్గెట్ చేసే ఆస్కారం ఉంది.
ఈ పరిస్థుతులు ఇలా ఉండగా మొన్న విడుదలైన 'కాటమరాయుడు' కేవలం పవన్ ఫ్యాన్స్ ను మాత్రమే అలరించే సినిమాగా మారిపోవడంతో అత్యంత భారీ మొత్తాలకు 'కాటమరాయుడు' సినిమాను కొనుక్కున్న బయ్యర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు గా వార్తలు వస్తున్నాయి. దీనికితోడు 'కాటమరాయుడు' సినిమా ప్రమోషన్ గురించి కనీసం పట్టించుకోకుండా పవన్ వ్యవహరిస్తున్న తీరు మరింత ఆశ్చర్యకరంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







