ఉగాది సమ్మేళన్ కు హాజరైన మోదీ

- March 26, 2017 , by Maagulf
ఉగాది సమ్మేళన్ కు హాజరైన మోదీ

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది సమ్మేళన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చలమేశ్వర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో నూతన తెలుగు సంవత్సరానికి ఆహ్వానం పలుకుదామని కేంద్ర మంత్రి వెంకయ్య ట్వీట్ చేశారు. ఉగాది వేడుకలను తన నివాసంలో నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com