ప్రయాణీకులు సీటు బెల్టుని విస్మరిస్తే డ్రైవర్ కు 400 దిర్హాంల జరిమానా
- March 26, 2017
దుబాయ్: " సుబ్బి పెళ్ళి..వెంకీ చావుకి వచ్చిందన్నట్లుగా " తమ పరిస్థితి మారిందని యుఎఇ లో డ్రైవర్లు వాపోతున్నారు. తమ వాహనంలో ప్రయాణిస్తున్న వినియోగదారుడు ఎవరైనా పొరబాటున తమ సీట్ బెల్ట్ నడుంకు కట్టుకోపోతే, వారు చేసిన తప్పిదానికి డ్రైవర్ భారీ మూల్యం చెల్లించుకోవాలి. ప్రతి ప్రయాణీకుడికి 400 ధిర్హాంల చొప్పున జరిమానా ఉంటుందని ఒక సీనియర్ అధికారి శనివారం తెలిపారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ అధిపతి జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జాఫెయిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకవేళ డ్రైవర్ తన సీట్ బెల్ట్ ధరించి ఉన్నప్పటికి వెనుక సీట్లలలో ఉన్నఇతర ప్రయాణీకులు సీట్ బెల్ట్ లను ధరించి ఉండకపోతే, ఆ తప్పిదానికి డ్రైవర్ వారందరి తరుపున జరిమానా చెల్లించాలని ఆయన చెప్పారు. ట్రాఫిక్ క్రమశిక్షణ సమస్యలు మరియు ఉల్లంఘనలకు సంబంధించి సమగ్ర అమలు జూలై మొదటి వారంలో ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని జనరల్ అల్ జాఫెయిన్ తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







