డ్రైఫ్రూట్స్ పొంగల్
- March 26, 2017
కావలసిన పదార్థాలు: బియ్యం: కప్పు, డ్రైఫ్రూట్స్(జీడిప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, బాదం): అరకప్పు, యాలకుల పొడి: చిటికెడు, పంచదార: నాలుగు లేదా ఐదు స్పూన్లు, నెయ్యి లేదా వెన్న: మూడు టేబుల్‌స్పూన్లు, కుంకుమ పువ్వు: చిటికెడు, పాలు: మూడు లేదా నాలుగు స్పూన్లు, నీళ్ళు: రెండు కప్పులు.
తయారీ విధానం: కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని అందులో నెయ్యి లేదా వెన్న వేసి కాగిన తరువాత డ్రైఫ్రూట్స్ వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కడిగిన బియ్యం వేసి దోరగా వేయించుకోవాలి. బియ్యం మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. బియ్యం వేగిన తరువాత సరిపడ నీరు పోసి ఉడికించాలి. బియ్యం మెత్తగా ఉడికిన తరువాత పంచదార, వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ జతచేయాలి. దించే ముందు కుంకుమ పువ్వు, యాలకుల పొడి జతచేసి దించేయాలి. తీపి ఎక్కువ కావాలనుకునే వారు పంచదార కొద్దిగా ఎక్కు వగా వేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







