డాక్టర్‌ నుంచి నిషేధిత మందుల స్వాధీనం

- March 27, 2017 , by Maagulf
డాక్టర్‌ నుంచి నిషేధిత మందుల స్వాధీనం

నిషేధిత మందుల్ని, ఆసియాకి చెందిన మహిళా డాక్టర్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అక్రమ గర్భస్రావాలకు పాల్పడుతున్నందుకుగాను ఆమెను ఇటీవలే పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆమె అక్రమంగా అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా సదరు డాక్టర్‌ని విచారించేందుకు నోటిఫై చేసినట్లు మినిస్ట్రీస్‌ అండ్‌ పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రాసిక్యూషన్‌ హెడ్‌ జనరల్‌ అట్టార్నీ మమ్‌దౌ అల్‌ మఅవ్‌దా వెల్లడించారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌కి ఈ డాక్టర్‌ విషయమై ఎన్‌హెచ్‌ఆర్‌ఏ సమాచారం అందించింది. ఇంకో వైపున ప్రాసిక్యూషన్‌, నిందితురాలి ఇంటిలో సోదాలు చేయాల్సిందిగా వారెంట్‌ జారీ చేయడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులకు నిషేధిత మందులు లభించాయి. కేసు విచారణ కొనసాగుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com